డ్రంకెన్‌ డ్రైవర్‌కు కోర్టు భారీ షాక్‌

డ్రంకెన్‌ డ్రైవర్‌కు కోర్టు భారీ షాక్‌

మద్యం మత్తులో స్టీరింగ్‌ పట్టి డ్రైవింగ్‌ చేసిన ప్రైవేటు ట్యావెల్స్‌ బస్సు డ్రైవర్‌కు నందిగామ కోర్టు షాకిచ్చింది. కంచికచర్లలో మద్యం తాగి పట్టుబడ్డ ప్రైవేటు బస్సు డ్రైవర్‌కు పది రోజుల జైలు శిక్ష విధించింది. దీంతోపాటు ఆ డ్రైవర్‌ లైసెన్స్‌ను రద్దు చేయాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి ఆకుల సత్యనారాయణ తీర్పు చెప్పారు.