అధికారుల అదుపులో మరో డ్రంకెన్‌ డ్రైవర్‌

అధికారుల అదుపులో మరో డ్రంకెన్‌ డ్రైవర్‌

ప్రైవేటు బస్సు డ్రైవర్లు మత్తు వదలడం లేదు. డ్రంకెన్‌ డ్రైవింగ్‌ను మానుకోవడం లేదు. మద్యం మత్తులోనే స్టీరింగ్‌ పడుతున్నారు. మద్యం తాగి బస్సు డ్రైవ్‌ చేసిన పలువురు డ్రైవర్లను నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఇకపై ప్రతిరోజూ తనిఖీలు చేస్తామని ప్రకటించారు. అయినప్పటకీ డ్రైవర్ల పరిస్థితిలో ఎటువంటి మార్పూ లేదు. నిన్న అర్ధరాత్రి అధికారులు మళ్లీ తనిఖీలు చేయగా.. మరో డ్రైవర్‌ దొరికిపోయాడు. గన్నవరం దగ్గర పొట్టిపాడు చెక్ పోస్ట్ దగ్గర ఆర్టీఏ అధికారుల తనిఖీల్లో వరుణ్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మద్యం తాగి బస్సు నడుపుతున్నట్టు గుర్తించారు. వెంటనే వేరే డ్రైవర్‌ ద్వారా బస్సును పంపించిన అధికారులు.. విశాఖలో బస్సును సీజ్‌ చేస్తామని స్పష్టం చేశారు. డ్రైవర్‌తోపాటు యాజమాన్యంపైనా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.