మద్యం సేవించి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్

మద్యం సేవించి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్

విధుల్లో ఉన్న ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్ మద్యం సేవించి బస్సు నడిపాడు. విషయాన్ని గుర్తించిన ప్రయాణికులు డ్రైవర్ తో వాగ్వాదానికి దిగారు. దీంతో ప్రయాణికులను వేరే బస్సులో గమ్యస్థానాలకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సూర్యాపేట నుంచి వేములవాడ వెళుతుంది. దంతాలపల్లి మీదుగా వెళుతున్న బస్సు నెమ్మికల్ స్టేజీ వద్దకు రాగానే డ్రైవర్ ఓ ఇంట్లోకి వెళ్లి మద్యం తాగాడు. డ్రైవర్ తూలుతూ నడుస్తుండటం చూసిన ప్రయాణికులు అతడిని నిలదీశారు. ఆందోళనకు దిగడంతో మరో బస్సులో ప్రయాణికులను పంపించారు.