మద్యం మత్తులో ఆ మహిళ ఏం చేసిందో చూశారా ?

మద్యం మత్తులో ఆ మహిళ ఏం చేసిందో చూశారా ?

ఫుల్ గా మందు తాగితే దాని వలన వచ్చే కిక్కు ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు.  ఆ మత్తులో ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు.  మద్యం మత్తులో చేసే పనులు దారుణంగా ఉంటాయి. మత్తు తలకెక్కితే.. అది మగవాళ్ళు కావొచ్చు.. ఆడవాళ్లు కావొచ్చు ఎలా ప్రవర్తిస్తారో వారికే తెలియదు.  అలా ఓ మహిళా మద్యం మత్తులో వీరంగం సృష్టించింది.  ఈ సంఘటన హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో జరిగింది. 

మద్యం మత్తులో ఉన్న లీసా అనే మహిళను పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చారు.  అలా పోలీస్ స్టేషన్ కు తీసుకొచ్చిన మహిళకు కాస్త మత్తు దిగిన తరువాత రెచ్చిపోయింది. పట్టుకోవడానికి ప్రయత్నించిన మహిళా పోలీసుల వేలు కొరికింది.  మెడపై రక్కింది.  పాపం పోలీసులు అవేమి పట్టించుకోకుండా.. ఆ మహిళను జాగ్రత్తగా కూర్చోపెట్టారు.  ప్రాధమిక వివరాల ప్రకారం ఆమెది నాగాలాండ్ అని, హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నట్టుగా తెలిసింది.  పూర్తిగా మద్యం మత్తు దిగిన తరువాత వివరాలు కనుక్కొని ఆమెను కుటుంబసభ్యులకు అప్పగిస్తారట.  మద్యం మత్తులో ఆ మహిళ సృష్టించిన వీరంగం తలుచుకొని పోలీసులు భయపడిపోయారు.