ఈ నెల కూడా సినిమా హాళ్ళకి కష్టమే !

ఈ నెల కూడా సినిమా హాళ్ళకి కష్టమే !

ఈ ఏడాది ఆరంభం సినీ పరిశ్రమకు అంతగా కలిసి రాలేదు.  ఒక్క 'ఎఫ్ 2' మినహా మిగతా పెద్ద సినిమాలు భారీ డిజాస్టర్లుగా మిగిలడంతో థియేటర్లలో జనం కరువయ్యారు.  రామ్ చరణ్ 'వినయ విధేయ రామ', బాలకృష్ణ 'ఎన్టీఆర్' సినిమాలు భారీ పరాజయాన్ని చవిచూశాయి.  ఇక మధ్యలో వచ్చిన అఖిల్ 'మిస్టర్ మజ్ను' కూడా డిజాస్టర్ అయింది.  దీంతో జనవరి నెలలో 'ఎఫ్ 2' ప్రదర్శనతో ఎలాగోలా నెట్టుకొచ్చిన థియేటర్ల యాజమాన్యాలు ఫిబ్రవరి నెలలో బాగా డీలా పడిపోయాయి.  ఇక మార్చి విషయానికొస్తే 1వ తేదీన వచ్చిన కళ్యాణ్ రామ్ '118' పర్వాలేదనిపించినా నెలాఖరు వరకు చెప్పుకోదగిన సినిమాలేవీ లేకపోవడంతో యాజమాన్యాల ఇబ్బందులు కొనసాగనున్నాయి.