ఏపీలో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు

ఏపీలో నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి డీఎస్సీ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. మొత్తం 125 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా, 7,902 టీచర్ పోస్టులకు 6,08,159 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. ఆన్ లైన్ విధానంలో రెండు దశల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. తొలి దశ సోమవారం నుంచి ఈనెల 30 వరకు, రెండో దశ జనవరి 18 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. తొలి దశకు 2,43,175 మంది హజరవుతున్నారు. రోజూ ఉదయం 9.30 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఏపీలో 113 కేంద్రాలు, తెలంగాణలో 4, ఒడిషాలో 3, బెంగళూరులో 2, చెన్నైలో 3 కేంద్రాలను ఏర్పాటు చేశారు.