తూర్పు గోదావరిలో గన్ కలకలం.. డిఏస్పీ ఏమన్నారంటే ?

తూర్పు గోదావరిలో గన్ కలకలం.. డిఏస్పీ ఏమన్నారంటే ?

ఏపీని వైఎస్ జగన్ బీహార్ లా మార్చేశాడని నారా లోకేష్ విమర్శించారు. నాడు-నేడు స్కీంలో భాగంగా నాడు పచ్చనిసీమగా ఉన్న ప్రాంతాన్ని నేడు ఫ్యాక్ష‌న్‌సీమ‌ చేసారు. గన్ రాకముందే జగన్ వస్తాడని గాలి కబుర్లు చెప్పారు. ఇప్పుడు రివర్స్ లో జ‌గ‌న్ రెడ్డి కంటే ముందు ఆయ‌న పెంచిపోషిస్తోన్న ఇసుక‌ మాఫియా గ‌న్‌లతో వ‌చ్చి తూర్పుగోదావరి జిల్లా, లంక‌ల గ‌న్న‌వ‌రంలో రెచ్చిపోయింది. భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టారు, ఇసుకని బంగారం చేసారు, ఇప్పుడు గన్నులు పట్టుకొని ప్రజల పై పడ్డారు వైకాపా ఇసుకాసురులు. స్యాండ్ మాఫియా పై కఠిన చర్యలు తీసుకోకపోతే ఎంతకైనా తెగిస్తారు ప్రజల ప్రాణాలు తీస్తారు అంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఒక వీడియో కూడా ఆయన తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించి పోలీసులు స్పందించారు.

పి.గన్నవరం మండలం లంకలగన్నవరంలో రెండు వర్గాల మధ్య జరిగిన  ఘర్షణ ఘటనా ప్రాంతాన్ని  అమలాపురం డియస్పి మాధవరెడ్డి సందర్శించారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన అనంతరం  డిఏస్పీ మాధవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఇది లంకలగన్నవరంలో ఉన్ననాలుగు ఎకరాల పెరుగు లంక భూ వివాదమే కాని ఇసుక ర్యాంపు వివాదం కాదని  వివరణ ఇచ్చారు.  ఘటనకు సంబంధించి ఇరువర్గాలపై కేసులు నమోదు  చేసి బైండోవర్ చేశామని తెలిపారు. కుసుమ సునీత అనే ఆమె పై ఏమైనా నేరచరిత్ర ఉన్నదా అనే కోణంపై కూడా విచారణ చేస్తున్నామని  అన్నారు. సునీత అమలాపురంకు చెందిన కామనగరువు గ్రామస్థురాలుగా గుర్తించామని పేర్కొన్నారు. గన్ తో బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకొంటామని ఆయన తెలిపారు.