ఆ ఆరోపణలపై డీఎస్‌ నో కామెంట్‌..

ఆ ఆరోపణలపై డీఎస్‌ నో కామెంట్‌..

టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు, మాజీ మంత్రి డి.శ్రీనివాస్‌పై ఆ పార్టీ నిజమాబాద్‌ జిల్లా నేతలు తిరుగుబాటు చేయడంతో వివాదం ముదురుతోంది. టీఆర్‌ఎస్‌లో ఉంటూ అదే పార్టీకి వ్యతిరేకంగా డీఎస్‌ పనిచేస్తున్నారంటూ ముఖ్యమంత్రికి నిజామాబాద్‌ నేతలు లేఖ రాశారు. ఈ లేఖపై డీఎస్‌ స్పందించారు. ఈ విషయమపై తానేమీ మాట్లాడలేనని చెప్పారు. తాను ఏ పార్టీలో ఉన్నా.. ఆ పార్టీకి వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయలేని చెప్పారు. నిజమాబాద్‌ నేతలు సీఎంకు ఫిర్యాదు చేస్తున్నారన్న అంశంపై స్పందిస్తూ.. 'చేసుకుంటే చేసుకోనివ్వండి' అని అన్నారు.