కాంగ్రెస్‌లోకి డీఎస్ రీఎంట్రీ?

కాంగ్రెస్‌లోకి డీఎస్ రీఎంట్రీ?

మాజీ మంత్రి డి.శ్రీనివాస్‌ మళ్లీ కాంగ్రెస్‌లో చేరబోతున్నారా? అంటే అవుననే చెబుతున్నాయి టీఆర్‌ఎస్‌ వర్గాలు. మూడు రోజులుగా ఢిల్లీలో మకాం వేసిన డీఎఎస్‌.. రేపో మాపో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోబోతున్నారని తెలిసింది. త్వరలోనే రాజ్యసభకు కూడా ఆయన రాజీనామా చేయనున్నారని తెలుస్తోంది. డీఎస్‌ను కాంగ్రెస్‌లో చేర్చుకునే అంశంపై పార్టీ హైకమాండ్‌.. టీపీసీసీ నేతలతో చర్చిస్తున్నట్టు తెలిసింది. మరో వైపు.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు డీఎస్‌ పాల్పడుతున్నారంటూ నిజామాబాద్‌ జిల్లాకు చెందిన టీఆర్‌ఎస్‌ నేతలు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఈక్రమంలోనే ఆయనపై కేసీఆర్‌ సీరియస్‌గా ఉన్నట్టు తెలిసింది.