ఆ విషయంలో దుర్క్యూర్ చాలా కష్టపడ్డాడు.!

ఆ  విషయంలో దుర్క్యూర్ చాలా కష్టపడ్డాడు.!
మలయాళంలో సూపర్ ఇమేజ్ సంపాదించుకున్న నటుడు దుర్క్యూర్ సల్మాన్  ఇప్పుడు తమిళంలో కూడా  సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.  తమిళం, మలయాళం రెండు  దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు.  తెలుగు మాత్రం పూర్తి డిఫరెంట్ గా ఉంటుంది.  తెలుగు భాషను పలకడం చాలా కష్టం. 
మహానటిలో  తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకోవడానికి దుర్క్యూర్ చాలా కష్టపడ్డాడు.  అక్షరాలు నేర్చుకొని పదాలు  చదువుకొని.. అర్ధం తెలుసుకొని డబ్బింగ్ చెప్పుకున్నాడు. ఎంత కష్టమైనప్పటికీ నేర్చుకొని డబ్బింగ్ చెప్పడం వలన  పాత్రకు జీవం పోసినట్టుగా ఉంటుంది.  అందుకే కష్టమైన స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడట.  తెలుగు భాషలో మరిన్ని సినిమాలు చేయడానికి తెలుగు నేర్చుకోవడం అవసరమని అంటున్నాడు దుర్క్యూర్ సల్మాన్.