నా భర్త చాలా మంచివాడు..వికాశ్ దూబే భార్య రిచా సంచలన వ్యాఖ్యలు..!

నా భర్త చాలా మంచివాడు..వికాశ్ దూబే భార్య రిచా సంచలన వ్యాఖ్యలు..!

యూపీలోని కాన్పూర్ లో 8మంది పోలీసులను పొట్టన పెట్టుకున్న గ్యాంగ్ స్టర్ వికాశ్ దూబేను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా ఆయన భార్య రిచా తన భర్త మంచివాడంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన భర్త చాలా మంచివాడని చెప్పుకొచ్చింది. పోలీసులు ఆయనను వాడుకుని, ఆ తర్వాత ఎన్కౌంటర్  చేశారని వాపోయింది. తనకు రాజ్యాంగం పట్ల పూర్తి విశ్వాసం ఉందని, తమకు న్యాయం జరుగుతుందని తెలిపింది. తన భర్త ఒక మంచి తండ్రి, మంచి భర్త అని తెలిపింది. కాన్పూర్ లో పోలీసులపై కాల్పుల అనంతరం దూబే ఫోన్ చేసాడని అదే ఆఖరిసారి మాట్లాడటం అని తెలిపింది. ఎన్కౌంటర్ ఘటనపై కమిటీని నియమించారని, తమకు న్యాయం జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. 1990లో తొలిసారి దూబే ను కలిశానని తన సోదరుడు ఇద్దరికి వివాహం జరిపించాడని చెప్పుకొచ్చింది. దూబే ప్రతి నెల రూ. 40 వేలు పంపించేవాడని వివరించింది. తమ పెద్ద కొడుకు రష్యాలో మెడిసిన్‌ చదువుతున్నాడని, చిన్న కుమారుడు 12వ తరగతిలో 90 శాతం మార్కులతో పాస్ అయ్యాడని తెలిపింది. ఇదిలా ఉండగా వికాశ్ దూబే తల్లితండ్రులు మాత్రం అతడిని వ్యతిరేకించినప్పటికీ భార్య మాత్రం దుబేను వెనకేసుకొని రావటం ఆశ్చర్యం కలిగిస్తోంది.