దుల్కర్ సల్మాన్ కు జోడీగా బన్నీ భామ

దుల్కర్ సల్మాన్ కు జోడీగా బన్నీ భామ

టాలీవుడ్‌ హీరోయిన్‌ పూజా హెగ్డే ఫుల్‌ ఫామ్‌లో ఉన్నారు. ఇటీవల స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ నటించిన 'అల వైకుంఠపురములో' సినిమాతో మంచి సక్సెస్‌ను సొంతం చేసుకున్న ఈ భామకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. మణిరత్నం 'ఓకే బంగారం' 'మహానటి' సినిమాలతో తెలుగు తెరకు సుపరిచితుడుగా మారాడు కుర్రహీరో దుల్కర్ సల్మాన్. దుల్కర్ కి మలయాళంలో ప్రత్యేక క్రేజ్ ఉంది. ఇంతవరకు తెలుగులో డైరెక్ట్ సినిమా చేయలేదు. ఇక ఈ వెరీ టాలెంటెడ్ దుల్కర్ సల్మాన్ ని తెలుగుతెరకు పరిచయం చేయాలని దర్శకుడు హను రాఘవపూడి ప్లాన్ చేసాడట. కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ సినిమాలో హీరోయిన్‌ పాత్ర కోసం చిత్ర యూనిట్‌ బుట్టబొమ్మను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దుల్కర్కు కథ వినిపించి ఓకే చేయించుకున్న హను - పూజాకు కూడా కథను వినిపించాలని చూస్తున్నాడు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా సినిమాలకు సంబంధించిన ఎలాంటి పనులు కూడా జరగడం లేదు. అలాగే పూజ హెగ్డే చేతిలో 'ప్రభాస్ 20', 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రాలు ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌కి జోడిగా 'కభీ ఈద్ కభీ దివాలి' చిత్రంలోనూ పూజా నటిస్తుంది.