కాశ్మీర్ లో దుల్కర్ సల్మాన్

కాశ్మీర్ లో దుల్కర్ సల్మాన్

'మహానటి' తర్వాత దుల్కర్ సల్మాన్ తెలుగు, తమిళ, మలయాళ బాషలలో చేస్తున్న సినిమా షూటింగ్ కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో జరుగుతోంది. గత వారం రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. 'మహానటి' సినిమా తీసిన స్వప్నాదత్, ప్రియాంక దత్ ఈ సినిమాకు నిర్మాతలు. ఆర్మీ లెఫ్టినెంట్ గా దుల్కర్ నటిస్తున్న ఈ రొమాంటిక్ డ్రామాకు ఇంకా టైటిల్ నిర్ణయించలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హేగ్డే నటించనున్నట్లు సమాచారం. ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కతున్న ఈ సినిమా దుల్కర్ కి 'మహానటి'లా మంచి పేరు తెచ్చిపెడుతుందేమో చూడాలి.