నకిలీ ఐఏఎస్ అరెస్ట్

నకిలీ ఐఏఎస్ అరెస్ట్

హైదరాబాద్ నగరంలోని చాదర్ ఘాట్ పోలీసు స్టేషన్ పరిధిలో నకిలీ ఐఏఎస్ అరెస్ట్ అయ్యాడు. వరంగల్ కు చెందిన సంపత్ కుమార్ (29) అనే వ్యక్తి హైదరాబాద్ మేడిపల్లిలో నివాసం ఉంటున్నాడు. నగరంలో చాలా మందికి తాను ఐఏఎస్ అని.. పార్లమెంట్ లో అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గా పనిచేస్తున్నానని నకిలీ గుర్తింపు కార్డులు చూపించేవాడు. ఈ క్రమంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి దాదాపు 20 మంది నుండి 6కోట్ల రూపాయలు వసూలు చేశాడు.

ఇక మలక్ పేటలో ఓ టెంపుల్ వద్ద తాను ధర్మ కర్తను అని తనకు తానుగా పరిచయం చేసుకుని ఆ టెంపుల్ కు 60వేలు విరాళంగా ఇచ్చాడు. ఓ వ్యక్తికి హుడ్కో నుంచి 3కోట్ల నిధులు ఇప్పిస్తానని చెప్పి కోటి ముప్పై ఎనిమిది లక్షలు వసూలు చేసాడు. ఆ నిధులు ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పక్కా సమాచారంతో.. నిండుతడు దిల్ షుక్ నగర్ వద్ద లాప్ టాప్ రిపేరు చేయించుకుంటుండగా పట్టుకుని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. నిందితుడి వద్ద నుంచి ఓ లాప్ టాప్, రెండు సెల్ ఫోన్లు, నాలుగున్నర తులాల బంగారు ఆభరణాలు, 5 డెబిట్ కార్డులు, ఇతర నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.