రాజకీయాల్లోనూ డూప్‌లు పెరిగిపోయారు...

రాజకీయాల్లోనూ డూప్‌లు పెరిగిపోయారు...

సినిమాల్లో లాగానే రాజకీయాల్లో కూడా డూప్‌లు పెరిగిపోయారని విమర్శించారు సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ... ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌... బయటకు బీజేపీని ఓడిద్దాం అని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం బీజేపీతో అంటకాగడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో కేసీఆర్‌... ప్రధాని మోడీతో కలిసి నాటకాలాడుతున్నారని మండిపడ్డ నారాయణ... థర్డ్ ఫ్రంట్ పేరుతో మోడీకి ఊడిగం చేసేందుకు సిద్ధమవుతున్నారని విమర్శించారు. మరోవైపు బీజేపీ, వైసీపీ కలయిక తథ్యం అని జోస్యం చెప్పారు నారాయణ. సీబీఐ, ప్రధాని మోడీకి పెంపుడు కుక్కల వ్యవహరిస్తోందని ఆరోపించిన ఆయన... కర్ణాటకలో బీజేపీ ఓటమితో వారికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందన్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ తీవ్రవ్యాఖ్యలు చేసిన సీపీఐ నేత... ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అచ్చోసిన ఆంబోతుల్లా తయారయ్యారని మండిపడ్డారు. 'దేశాన్ని రక్షిద్దాం జాతిని రక్షించుకుందాం' అనే నినాదంతో సీపీఐ ఆధ్వర్యంలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో నాలుగు జాతాలు నిర్వహిస్తామని ఆయన ప్రకటించారు.