దుర్గమ్మ భక్తులపై మరో భారం

దుర్గమ్మ భక్తులపై మరో భారం

బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకునే భక్తులపై ఆలయ పాలకమండలి మరో భారం మోపింది. ఇవాళ ఛైర్మన్ గౌరంగబాబు అధ్యక్షతన పాలకమండలి సమావేశం జరిగింది. ఈవో పద్మ, ఇతర పాలకమండలి సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

పాలకమండలి తీసుకున్న నిర్ణయాలు:
* రూ.500గా ఉన్న అమ్మవారి శాంతి కళ్యాణం టిక్కట్ ధరను రూ.వెయ్యికి పెంపు.
* యాత్రికుల సౌకర్యార్ధం గొల్లపూడిలో ఐదు అంతస్ధుల భవన నిర్మాణం 
* కేశఖండన శాలలో క్షురకులు అనారోగ్యంతో మరణిస్తే.. వారి కుటుంబీకులకు ఉద్యోగం ఇచ్చే ‌ప్రతిపాదన తిరస్కరణ.
* శివాలయం ఉత్తర భాగంలో నిర్మించతలపెట్టిన గ్రీనరీ ప్రతిపాదన వాయిదా.
* కొండపై ఉన్న పాశుపతేశ్వర  ఆలయాన్ని పునర్నిర్మాణం చేసేందుకు ఆమోదం.
* దేవస్థానానికి చెందిన 140 ఎకరాలు వేలం వేసేందుకు నిర్ణయం.