సన్నీ లియోనిగా మారిన దుర్గావతి

సన్నీ లియోనిగా మారిన దుర్గావతి

ఉత్తరప్రదేశ్ వారణాసిలోని బాలియా జిల్లా ఓటర్ జాబితాలో సన్నిలియోని ఫోటోతో పాటు ఏనుగు, పావురం, జింక ఫోటోలు దర్శనమిచ్చాయి. జిల్లాలో ఇటీవలే తుది జాబితాను తయారు చేసి ప్రభుత్వ వెబ్ సైట్ లో ఉంచారు.  ఈ వ్యవహారాన్ని ప్రభుత్వాధికారులు సీరియస్ గా తీసుకున్నారు. బాధ్యులైన వారిపై చర్యలకు సిద్దమయ్యారు. వారాణాసి వివేకానంద కాలనీకి చెందిన దుర్గావతి సింగ్ స్ధానంలో సన్నిలియోని ఫోటో, మాజీ మంత్రి నరద్ రాయ్ పేరుకు ఎదురుగా ఏనుగు,  అంకుర్ సింగ్ స్థానంలో జింక ఫోటోలను చేర్చారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాలతో జిల్లా యంత్రాంగం తుది ఓటర్ జాబితాను జూలై 15న వెబ్ సైట్ లో ఉంచింది. 

ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న జిల్లా అధికారులు డాటా ఎంట్రీ ఆపరేటర్ విష్ణుదేవ్ వర్మపై కేసు నమోదు చేశారు. అతడిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటు బెల్త్రా రోడ్డు తహసీల్ కార్యాలయానికి బదిలి చేశారు. కాని వెబ్ సైట్ లో తుది జాబితా ఉంచడానికి ముందే తప్పును గుర్తించామని అధికారులు అంటున్నారు. ఈ విషయంపై కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది.