కారును శిక్షణ కోసం అమ్మాలనుకోలేదు.. వేరే కారణం ఉంది : ద్యుతీ చంద్    

కారును శిక్షణ కోసం అమ్మాలనుకోలేదు.. వేరే కారణం ఉంది : ద్యుతీ చంద్    

భారత స్టార్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ ఒలంపిక్ శిక్షణ కోసం తన బిఎమ్‌డబ్ల్యూ కారును అమ్ముతున్నట్లు తెలిపింది. అయితే ఈ సమాచారం తెలిసిన తర్వాత కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, ఒడిశా ప్రభుత్వం మరియు అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఎఫ్ఐ) ఆమె శిక్షణకు కావాల్సిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తామని తెలిపాయి. ఇక ఇప్పుడు తాగాజా ద్యుతీ చంద్  తన కారును  శిక్షణ కోసం అమ్మాలనుకోలేదు అని దానికి వేరే కారణం ఉంది అంటూ తెలిపింది. అదేంటంటే..  బిఎమ్‌డబ్ల్యూ లగ్జరీ కారును మెంటేన్ చేయడానికి తనదగ్గర డబ్బు లేదని అందుకే దానిని అమ్మాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. అయితే వచ్చే ఏడాదికి వాయిదా పడిన ఒలంపిక్స్ కు ద్యుతీ చంద్ అర్హత సాధించిన విషయం తెలిసందే.