'ఆర్ఆర్ఆర్' బడ్జెట్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే !

'ఆర్ఆర్ఆర్' బడ్జెట్ చూస్తే కళ్ళు తిరగాల్సిందే !

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'.  రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమా బడ్జెట్ 200 కోట్ల వరకు ఉంటుందని మొదట్లో అందరూ అనుకున్నారు.  కానీ తాజాగా జరిగిన ప్రెస్ మీట్లో బడ్జెట్ అంతకన్నా ఎక్కువని తేలింది.  నిర్మాత దానయ్య మాట్లాడుతూ సినిమాకు 350 కోట్ల నుండి 400 కోట్ల వరకు బడ్జెట్ కేటాయించినట్టు తెలిపారు.  సినిమాను అన్ని అంశాల్లోనూ ఉన్నతంగా ఉండేలా రూపొందించడానికే ఇంత ఎక్కువ బడ్జెట్ అని అన్నారు.  దీంతో ప్రేక్షకులు, సినీ వర్గాలు పెట్టుబడే ఇంతుంటే ఇక ఓవరాల్ బిజినెస్ ఏ స్థాయిలో ఉంటుందో అని ముక్కున వేలేసుకుంటున్నారు.