ధోని 'హెలికాప్టర్' సాంగ్...

ధోని 'హెలికాప్టర్' సాంగ్...

ప్రస్తుతం లాక్ డౌన్ సమయం గడుపుతున్న వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో తన చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్కే) సహచరుడు మరియు కెప్టెన్ అయిన ఎంఎస్ ధోని కోసం కొత్త పాటను కంపోజ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే బ్రావో ఆ పాట యొక్క మరో టీజర్ ను తాజాగా విడుదల చేసి భారత ప్రపంచ కప్ విజేత కెప్టెన్‌కు అంకితం చేశారు. సిఎస్కే కోసం ఎంఎస్ ధోని కెప్టెన్సీలో ఆడుతున్న డ్వేన్ బ్రావో, ఈ పాట యొక్క టీజర్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ లో విడుదల చేశారు. పూర్తి పాట ధోని పుట్టినరోజున విడుదల కానుందని తెలిపారు. అయితే ఎంఎస్ ధోని తన 39 వ పుట్టినరోజును ఈ జూలై 7 న జరుపుకోనున్నారు. దాంతో "మీరు జూలై 7 వ తేదీకి సిద్ధంగా ఉన్నారా !! ధోని పుట్టినరోజు ను ఈ ప్రత్యేక ట్రాక్‌తో జరుపుకోబోతున్నాం !!  ఈ పాటకు మీ హెలికాప్టర్ డ్యాన్స్ మమల్ని చూడనివ్వండి'' అంటూ  వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడు. చూడాలి మరి ఈ ధోని పాట ఎలా ఉండబోతుంది అనేది.