కరోనా పై డ్వేన్ బ్రావో కొత్త పాట...

కరోనా పై డ్వేన్ బ్రావో కొత్త పాట...

చైనా నుండి వచ్చిన కరోనా వ్యాప్తి వలన ఇప్పటికే ప్రపంచం వణికిపోతుంది. అలాగే ఈ వైరస్ క్రీడా ప్రపంచాన్ని కూడా నిలిపివేసింది. కరోనావైరస్ వ్యాప్తి కారణంగా అన్ని ప్రధాన క్రీడా కార్యక్రమాలు వాయిదా వేయబడ్డాయి లేదా రద్దు చేయబడ్డాయి. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు ఆటలు లేకపోవడం వలన రకరకాల మార్గాలు ఎంచుకుంటున్నారు. వెస్టిండీస్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో, తన పాటలతో కూడా గుర్తింపు సంపాదించుకున్నాడు. అయితే ఇప్పుడు కరోనా మహమ్మారిపై తన కొత్త పాటను అభిమానులకు ఇన్‌స్టాగ్రామ్ లో వినిపించాడు. ఈ ప్రపంచ కరోనా సంక్షోభం మధ్య ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల మనోధైర్యాన్ని పెంచడానికి డ్వేన్ బ్రావో ఈ  కొత్త పాట విడుదల చేసినట్టు వెల్లడించాడు. కరోనా మహమ్మారి నేపథ్యంలో అపూర్వమైన భావోద్వేగాలను ప్రతిబింబించడంలో ప్రపంచవ్యాప్తంగా చాలా మంది కళాకారులు తమ వంతు కృషి చేశారు. అంతకుముందు, న్యూజిలాండ్ క్రికెటర్ ఇష్ సోధి ఒక పాటతో ముందుకు వచ్చిన విషయం అందరికి తెలిసిందే.