రీపోలింగ్‌పై ద్వివేది సంచలన వ్యాఖ్యలు

రీపోలింగ్‌పై ద్వివేది సంచలన వ్యాఖ్యలు

చంద్రగిరిలో పోలింగ్‌ సమయంలో అక్రమాలు జరిగినట్టు చాలా బలమైన సాక్ష్యం ఉందని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ద్వివేది తెలిపారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ చంద్రగిరిలో 2 పోలింగ్‌ కేంద్రాల్లో నిబంధనలు అతిక్రమించారని.. ఇందుకు సంబంధించిన వీడియో తమ దగ్గర ఉందని చెప్పారు. వీడియో చూస్తే ప్రజాస్వామ్యంలో ఇలా కూడా జరుగుతుందా అని అనిపిస్తోందన్నారు. బలమైన వీడియో సాక్ష్యం ఉండడం వల్లే రీపోలింగ్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహించని అధికారులపై చర్యలు తీసుకుంటామన్న ద్వివేది.. రెండో సారి రాష్ట్రంలో రిపోలింగ్ జరపకూడదని నిబంధనేదీ లేదని చెప్పారు. అక్రమాలు జరిగినట్టు ఆలస్యంగా తెలియడం వల్లే ఇప్పుడు రిపోలింగ్ పై నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.