మ్యాచ్‌కు రూ.60 కోట్లు.. మొత్తం రూ.6138 కోట్లు!

మ్యాచ్‌కు రూ.60 కోట్లు.. మొత్తం రూ.6138 కోట్లు!
టీం ఇండియా ఆడనున్న క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసార హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. 2018 నుంచి 2023 కాలానికిగాను రూ.6138 కోట్లతో టీవీ, డిజిటల్ హక్కులను స్టార్‌ ఇండియా సొంతం చేసుకుంది. 2012-2018 కాలానికి రూ.3851 కోట్లు ఉన్న విలువ ఇప్పుడు రూ.6138 కోట్లకు పెరిగింది. మూడు రోజులపాటు జరిగిన ఈ-వేలంలో సోనీ పిక్చర్స్ నెట్‌వర్క్ ఇండియా, స్టార్ ఇండియా, రిలయన్స్ సంస్థలు పోటీ పడ్డాయి. ఈ ఐదేళ్ల కాలంలో టీమిండియా 102 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనుంది. అంటే టీమిండియా ఆడే ఒక్కొ మ్యాచ్‌కి స్టార్ ఇండియా రూ.60.14 కోట్లు వెచ్చించినట్టు లెక్క. మెన్స్ టీమ్ డొమెస్టిక్ మ్యాచ్‌లు, వుమెన్స్ టీమ్ అంతర్జాతీయ మ్యాచ్‌లను కూడా స్టార్‌ ఇండియా ప్రసారం చేయనుంది.