ఈ-సిగరెట్లు హానికరం.. అందుకే నిషేధం..

ఈ-సిగరెట్లు హానికరం.. అందుకే నిషేధం..

ఈ-సిగరెట్లపై ఇప్పటికే నిషేధం విధిస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.. అయితే, ఈ సిగరెట్లు హానికరం.. అందుకే వాటిపై నిషేధం విధించామని తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ... మన్‌కీ బాత్ రేడియో కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ.. యువతకు కీలకమైన సూచనలు చేశారు.. దేశంలో యువకులంతా పొగాకు వినియోగానికి దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. పొగాకు, ఈ సిగరెట్లు, సిగరెట్లతో ఆరోగ్యానికి నష్టం జరుగుతుందన్న ప్రధాని.. వాటికి దూరంగా ఉండాలని సూచించారు... ఇక, ఈ- సిగరెట్లు హాని చేయవన్న అపోహ ఉందని.. కానీ సిగరెట్లు, పొగాకు మాదిరిగానే ఈ- సిగరెట్లు కూడా ఆరోగ్యానికి చాలా హానికరమని హెచ్చరించారు. అందుకే ఈ- సిగరెట్ల అమ్మకం, వినియోగంపై నిషేధం విధించినట్టు తెలిపారు ప్రధాని మోడీ.