ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఓ నిర్ణయానికి వచ్చింది

ఫ్లిప్‌కార్ట్‌ కూడా ఓ నిర్ణయానికి వచ్చింది

కరోనా ప్రభావంతో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది.. మొదట ఈ నెల 31 వ తేదీ వరకు లాక్ డౌన్ ప్రకటించగా... రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూనేవున్నాయి... దీంతో  దేశ వ్యాప్తంగా 21 రోజుల పాటు లాక్‌ డౌన్‌ ప్రకటించారు ప్రధాని మోడీ... ఇప్పటికే వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడగా.. ఆన్ లైన్ సర్వీసులు అడపా దడపా నడిపించారు... కానీ ఈ ఉపద్రవాన్ని సర్కార్ సీరియస్ గా తీసుకోవడం తో ఇప్పుడు భారత్‌లో తమ ఆన్‌లైన్‌ సర్వీసులను నిలిపివేస్తున్నట్లు వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్‌ ప్రకటించింది. ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో నోటీసును కంపెనీ పెట్టింది. అన్ని రకాల సేవలను నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఇక.. నిత్యావసర వస్తువులు మినహా.. మిగిలిన రంగాలకు చెందిన వస్తువుల సరఫరాను ఆపేస్తున్నట్లు అమెజాన్‌ ఇప్పటికే ప్రకటించింది.