ఏపీలో ఎంట్రెన్స్ టెస్ట్ టైం టేబుల్...ఎప్పుడెప్పుడు ఏయే ఎంట్రెన్స్ అంటే ?

ఏపీలో ఎంట్రెన్స్ టెస్ట్ టైం టేబుల్...ఎప్పుడెప్పుడు ఏయే ఎంట్రెన్స్ అంటే ?

 ఏపీలో ఎంట్రెన్స్ టెస్ట్ తేదీలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఏపీలో సెప్టెంబర్ 15 నుంచి 21 లోపు అన్ని ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామ‌ని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు. ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీసెట్, లా సెడ్, ఎడ్ సెట్‌ల‌న్నీ ఒకే వారంలో నిర్వహిస్తామ‌ని తెలిపారు. ఇక అక్టోబ‌ర్ 15 నుంచి జూనియ‌ర్ క‌ళాశాల‌లు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు. క‌ళాశాల‌లు తెర‌వ‌గానే గ‌త విద్యా సంవత్సరం చివరి సెమిస్టర్ పరీక్షలు నిర్వహిస్తామని అన్నారు.

ఆయన ప్రకటించిన షెడ్యూల్ ఈ విధంగా ఉంది. 
సెప్టెంబర్ 10, 11 న  ఐ సెట్
సెప్టెంబర్ 14 న ఈ సెట్
సెప్టెంబర్ 17 నుండి 25 వరకు ఎంసెట్
సెప్టెంబర్ 28,29,30 తేదీల్లో ఏపిజిఈసెట్ 
అక్టోబర్ 1న ఎడ్ సెట్ (ఉదయం), లా సెట్ (మధ్యాహ్నం) 
అక్టోబర్ 2 నుంచి 5 వరకు ఏపీపీఈ సెట్