విద్యార్థులు ఇవి తప్పనిసరిగా పాటించాలి : ఎంసెట్ కన్వీనర్

విద్యార్థులు ఇవి తప్పనిసరిగా పాటించాలి : ఎంసెట్ కన్వీనర్

కోవిడ్ నిబంధనల ప్రకారం ఎంసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ పేర్కొన్నారు. ఆయన ఎన్టీవీ ద్వారా  పలు ముఖ్యమైన విషయాలను విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులను పరీక్ష కన్నా గంటన్నర ముందే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతి ఇస్తామని అన్నారు. మొత్తం102 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.. తెలంగాణ లో 79, ap లో 23 ఏర్పాటు చేశామన్నారు. హాల్ టికెట్స్ లో మూడు అంశాలు ఉంటాయి.. విద్యార్థుల టెస్ట్ సెంటర్ డీటెయిల్స్, సమయం, పరీక్ష కేంద్రాలకు ఈజీ గా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ కూడా హాల్ టికెట్స్ లో ఉంటుందన్నారు. సెల్ఫ్ డిక్లరేషన్ ఫార్మ్ ఉంటుంది.. విద్యార్థికి కోవిడ్ లక్షణాలు ఉన్నాయా లెవా అనేది తెలుపాల్సి ఉంటుందన్నారు. కోవిడ్ పాజిటివ్ ఉంటే ముందే సమాచారం ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. వారికి తర్వాత పరీక్షలు నిర్వహించడం జరుగుతోందన్నారు. లక్షణాలు ఉన్న వాళ్ళు పరీక్ష కేంద్రాలకు వచ్చినా  వెనక్కి పంపిస్తామని.. వారికి తర్వాత పరీక్ష నిర్వహిస్తామని వెల్లడించారు. బయో మెట్రిక్ బదులు ఫొటో రికాగ్నిషన్ సిస్టమ్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కేంద్రాలతో పాటు కొన్ని ముఖ్య పట్టణాల్లో కూడా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు ప్రకటించారు. మాస్క్ లు లేకుండా వచ్చే వారికి మాస్క్స్ ప్రొవైడ్ చేస్తామన్నారు. ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష రోజు ఏదైనా జాతీయ స్థాయి పరీక్ష ఉంటే...  ఆ పరీక్ష రాసే విద్యార్థులు కోరితే వారికి మరో సెషన్ లో పరీక్ష రాసే అవకాశం ఇస్తామని స్పష్టం చేసారు. ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలు అక్టోబర్ మొదటి వారంలో ప్రకటిస్తామని తెలిపారు. నవంబర్ మొదటి వారం లో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ప్రారంభం అవుతాయన్నారు. లక్షా 43 వేల 165 మంది విద్యార్థుల్లో లక్ష 18 వేల మంది విద్యార్థులు ఇప్పటికే హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకున్నారని తెలిపారు. హాల్ టికెట్స్ వెంటనే డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. రెండు రోజుల ముందే టెస్ట్ సెంటర్ కి వెళ్లి చూసుకోవాలని.. ఆందోళన చెందొద్దని సలహా ఇచ్చారు.