రేపటి నుంచి తెలంగాణ ఎంసెట్

రేపటి నుంచి తెలంగాణ ఎంసెట్

తెలంగాణ ఎంసెట్‌–2019 ఆన్‌లైన్‌ పరీక్షలు ఈనెల 3 నుంచి ప్రారంభం కానున్నాయి. 3, 4, 6 తేదీల్లో ఇంజనీరింగ్, 8, 9 తేదీల్లో అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ స్ట్రీమ్‌ ప్రవేశ పరీక్షలు జరుగనున్నాయి. ఇందుకు ఎంసెట్‌ కమిటీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండు సెషన్లుగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టింది. 18 పట్టణాల పరిధిలోని 94 పరీక్ష కేంద్రాలను ఏర్పా టు చేసింది. తెలంగాణలో 15 పట్టణాల పరిధిలోని 83 కేంద్రాల్లో, ఏపీలో మూడు పట్టణాల పరిధిలోని 11 కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేలా చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు 2,17,199 మంది విద్యా ర్థులు హాజరు కానున్నారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఎంసెట్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ యాదయ్య తెలిపారు. విద్యార్థులను పరీక్ష సమయానికికంటే గంటన్నర ముందునుంచే పరీక్ష హాల్లోకి అనుమతిస్తామని పేర్కొన్నారు. పరీక్ష ప్రారంభం అయ్యాక నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని వెల్లడించారు. విద్యార్థులు చివరి క్షణంలో ఇబ్బందులు పడకుండా వీలైనంత ముందుగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.