పీవీ సింధుకు షాక్.. తొలి రౌండ్‌లోనే ఇంటికి..!

పీవీ సింధుకు షాక్.. తొలి రౌండ్‌లోనే ఇంటికి..!

భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరోసారి నిరాశపరిచింది.. వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ నెగ్గి సత్తా చాటిన సింధు.. ఆత తర్వాత వరుసగా విఫలమవుతూనే ఉంది.. ఇప్పటికే చైనా(బీడబ్ల్యూఎఫ్ సూపర్ 1000), కొరియా, డెన్మార్క్ ఓపెన్లలో తొలి రౌండ్‌లోనే వెనుదిరగగా.. ఫ్రెంచ్ ఓపెన్‌లో కొంచెం మెరుగైన ప్రదర్శన ఇచ్చింది.. అయితే.. ఇవాళ జరిగిన చైనా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీ తొలి మ్యాచ్‌లోనే ఇంటిముఖం పట్టింది. తన కన్నా తక్కువ ర్యాంకు ప్లేయర్ చేతిలో ఘోర పరాజయంపాలైంది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్‌లో ఆరో సీడ్ సింధు.. 42వ ర్యాంకర్ పాయ్ యు(చైనీస్ తైపీ) చేతిలో 13-21, 21-18, 19-21తో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్‌లో 74 నిమిషాల పాటు హోరాహోరీగా పోరాటం చేసింది.. అంతర్జాతీయ టోర్నీల్లో అంతగా అనుభువంలేని పాయ్ యు విజయం కోసం అద్భుతమైన ప్రదర్శన ఇవ్వగా.. సింధు పరాజయం చెందింది. తొలి సెట్‌ను సులువుగా 13-21 తేడాతో కైవసం చేసుకున్న పాయ్‌కు రెండో సెట్‌లో ఎదురుదెబ్బ తగిలింది. రెండో సెట్‌లో 21-18తో సింధు పైచేయి సాధించింది.. ఇక, నిర్ణయాత్మక మూడో సెట్‌ హోరాహోరీగా సాగినా.. 19-21 తేడాతో పాయ్ యు గెలుచుకోవడంతో విజయం ఆమెను వరించింది.