చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం..

చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు.. పరుగులు తీసిన జనం..

ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లాలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి... జిల్లాలోని రామసముద్రం మండలం కాప్పలి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది... స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. కాప్పలి గ్రామంలో భూమి మూడుసార్లు కంపించింది.. అంతేకాకుండా.. భూమి లోపల నుంచి భారీ శబ్ధాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు.. ఇక, భూ ప్రకంపనలతో.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు ప్రజలు.. భూమి లోపల నుంచి భారీ శబ్ధాలు వస్తుండడంతో.. ఇళ్లలోకి వెళ్లేందుకే వణికిపోతున్నారు. కాగా, భారీ వర్షాల తర్వాత హైదరాబాద్‌లోని బోరబండ ప్రాంతంలోనూ ఇలాంటి పరిస్థితే ఎదురైన సంగతి తెలిసిందే.. నివర్ తుఫాన్ ఎఫెక్ట్‌తో చిత్తూరు జిల్లాలో ఈ మధ్యే భారీ వర్షాలు కురిశాయి.. మరి ఆ వర్షాల ప్రభావం ఏమైనా ఉండిఉంటుందా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.