యాత్ర సినిమాపై ఈసీ కీలక నిర్ణయం

యాత్ర సినిమాపై ఈసీ కీలక నిర్ణయం

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవితం ఆధారంగా మమ్మూట్టి హీరోగా యాత్ర అనే సినిమా చేశారు.  ఈ సినిమా ఫిబ్రవరి 8 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది.  సినిమా బాగుందనే టాక్ వచ్చినా మరీ స్లో నరేషన్ కారణంగా ఎక్కువ రోజులు థియేటర్లో నిలబడలేకపోయింది.  

యాత్ర సినిమా శాటిలైట్ రైట్స్ ను మా టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.  మాటీవీ ఈ సినిమాను ఏప్రిల్ 7 వ తేదీ అంటే ఆదివారం రోజున ప్రదర్శించబోతున్నారు.  ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి ... ఎన్నికలపై ప్రభావం పడుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీ ఈసీకి లేఖను రాసింది.  ఎన్నికలు పూర్తయ్యే వరకు సినిమాను టీవీలో ప్రదర్శితం కాకుండా నిలిపివేయాలని కోరింది.  

తెలుగుదేశం పార్టీ లేఖకు ఎలక్షన్ కమిషన్ స్పందించింది.  టీవీ లేదా సినిమా థియేటర్లలో ప్రదర్శించే సినిమాలు తమ పరిధిలోకి రావని, దీనిపై తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని చెప్పింది.