వైఎస్ వివేకా హత్య పై ఈసీ ఆరా..

వైఎస్ వివేకా హత్య పై ఈసీ ఆరా..

వైఎస్ వివేకానందరెడ్డి హత్యోదంతంపై ఈసీ ఆరా తీసింది. హత్యకు దారితీసిన కారణాలేమిటో తెలుసుకోవాలని అధికారులను ఆదేశించింది. కడప జిల్లా ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేది పరిస్థితిని సమీక్షించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడొద్దని పోలీసులను ఆదేశించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగితే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. రాయలసీమలో శాంతి భద్రతలపై ఆయా జిల్లాల ఎస్పీలతో ద్వివేది సమీక్షించారు. అలాగే కర్నూలు జిల్లా మంత్రాలయంలో జరిగిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గన్‌మెన్‌ కాల్పులు ఘటనపై ఆయన నివేదిక కోరారు.