ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ కీలక ఆదేశాలు

ఎగ్జిట్ పోల్స్ పై ఈసీ కీలక ఆదేశాలు

ఎగ్జిట్‌పోల్స్‌ వెల్లడిపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈరోజు సాయంత్రం 6.30 తర్వాతే ఎగ్జిట్‌ పోల్స్‌ వెల్లడించాలని, లేని పక్షంలో వీటిని ప్రసారం చేసిన వ్యక్తులు, మీడియా మాధ్యమాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు ‘ప్రజాప్రాతినిథ్య చట్టం 1951, సెక్షన్‌ 126(1) బి ప్రకారం పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎన్నికలకు సంబంధించిన ప్రసారాలు, ఎన్నికల ఫలితాలపై నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌, సర్వే వివరాలు.. ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రసారం చేయడం నిషిద్ధం’ అని నోటీసులో పేర్కొంది. అయితే నేటితో సార్వత్రిక సమరం ముగిసిన నేపథ్యంలో ఆరున్నర గంటల తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ విడుదల చేసుకోవచ్చని ఆదేశాలు జారీ చేసింది. చివరి విడత పోలింగ్‌లో భాగంగా చండీగఢ్‌ సీటుతో పాటు ఉత్తరప్రదేశ్‌(13), పంజాబ్‌(13), పశ్చిమబెంగాల్‌(9) బీహార్‌(8), మధ్యప్రదేశ్‌(8), హిమాచల్‌ప్రదేశ్‌(4), జార్ఖండ్‌(3) రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరగుతున్నాయి. కాగా ఎన్నికల తుది ఫలితాలు మే 23న వెల్లడికానున్నాయి.