కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

కేసీఆర్‌కు ఈసీ నోటీసులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా మత విద్వేషాలను రెచ్చగోట్టేలా కేసీఆర్‌ వ్యాఖ్యానించారంటూ విశ్వ హిందూ పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు ఈసీకి ఫిర్యాదు చేశారు. 'హిందూగాళ్లు.. బొందుగాళ్లు.. దిక్కుమాలిన దరిద్రపుగాళ్లు' అని కించపరిచేలా మాట్లాడారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.  ఈమేరకు కేసీఆర్‌ ప్రసంగం కాపీని పరిశీలించిన ఈసీ.. ఈనెల 12వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఆ లేఖలో ఈసీ స్పష్టం చేసింది. గడువులోగా వివరణ ఇవ్వని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని వివరించింది.