ఏపీ కేబినెట్‌ భేటీపై ఈసీ కీలక నిర్ణయం

ఏపీ కేబినెట్‌ భేటీపై ఈసీ కీలక నిర్ణయం

ఉత్కంఠకు తెరపడింది. ఏపీ కేబినెట్ సమావేశానికి ఎన్నికల కమిషన్‌ ఓకే చెప్పింది.  14వ తేదీన మంత్రి వర్గ సమావేశానికి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేబినెట్‌లో అంశాలకు అంగీకారం చెప్పిన ఈసీ.. పెండింగ్‌ చెల్లింపులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకూడదని స్పష్టం చేసింది.

ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో కేబినెట్‌ భేటీకి ఈసీ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చెప్పడంతో.. కేబినెట్‌లోని అంశాల అజెండాను సీఎంవో పంపింది. మరోవైపు..  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ఇవాళ ఉదయం సీఎం చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. ఈక్రమంలో కేబినెట్‌కు ఈసీ అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.