విపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చిన ఈసీ..

విపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చిన ఈసీ..

వీవీ ప్యాట్ల లెక్కింపు పై విపక్షాల డిమాండ్ ను ఎలక్షన్ కమిషన్ తోసిపుచ్చింది. ఈవీఎంల లెక్కింపు తర్వాతే వీవీ ప్యాట్ స్లిప్పులు అధికారులు లెక్కిస్తారని తెలిపింది. కౌంటింగ్ ప్రక్రియలో ఎలాంటి మార్పులేదని ఈసీ స్పష్టం చేసింది. వీవీ ప్యాట్ స్లిప్పుల లెక్కింపుపై పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి విపక్షాలు. ఓట్ల లెక్కింపుకు కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో.. పోరును ఉధృతం చేశాయి. మంగవారం ఢిల్లీలో ఎన్నికల సంఘాన్ని కలిసిన 21 పార్టీలకు చెందిన ముఖ్య నేతలు.. వినతిపత్రం అందజేశారు. సుప్రీంకోర్టు సూచన ప్రకారం ముందుగా ఐదు వీవీప్యాట్‌ స్లిప్పుల్ని లెక్కించాలని డిమాండ్‌ చేశారు. 

వీవీ ప్యాట్ స్లిప్పుల్ని లెక్కించడానికి ఈసీకి ఉన్న సమస్యేంటో చెప్పాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. పోలింగ్‌, ఓట్ల లెక్కింపు విషయంలో పారదర్శకత, ప్రజల్లో నమ్మకం కల్పించడం ఎన్నికల సంఘం బాధ్యతన్నారు. రాజకీయ పార్టీలు ప్రస్తావిస్తున్న సమస్యలు చిన్నవి కాదని.. వెంటనే పరిష్కరించకపోతే జఠిలంగా మారతాయన్నారు. 5 శాతం వీవీప్యాట్‌ స్లిప్పుల లెక్కింపులో ఏమైనా సమస్యలు ఎదురైతే.. ఆ అసెంబ్లీ నియోజకవర్గంలోని మొత్తం స్లిప్పులను లెక్కించాలన్నారు. చాలా రోజులుగా ఈవీఎంల పనితీరుపై ఈసీకి ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోలేదన్నారు.