గ్రేటర్ ఎన్నికల్లో గెలుచిన అభ్యర్థుల గెజిట్ విడుదల

గ్రేటర్ ఎన్నికల్లో గెలుచిన అభ్యర్థుల గెజిట్ విడుదల

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థుల గెజిట్ విడుదల చేశారు. ఫిబ్రవరి 10 తో గ్రేటర్ పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. వారి పదవీ కాలం ముగిసిన వెంటనే కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇక ప్రమాణ స్వీకారం కోసం ప్రత్యేక కౌన్సిల్ సమావేశం జరగనుంది. ఇక డిసెంబర్ 1 వ తేదీన జీహెచ్ఎంసి ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే.  డిసెంబర్ 4 వ తేదీన ఫలితాలు విడుదలయ్యాయి.  అయితే, మేయర్ ఎంపిక ఇప్పటి వరకు జరగలేదు. ఇక కొద్ది రోజుల మేయర్ ఎన్నికకు సంబంధించిన ఎన్నికల సంఘం ఓ ప్రకటన చేసింది.  ఫిబ్రవరి 11 వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక ఉంటుందని ప్రకటించింది. ఇక కొద్ది రోజుల క్రితం జీహెచ్ఎంసి ఎన్నికల్లో విజయం సాధించిన అభ్యర్థులు ఎన్నికల సమయంలో చేసిన ఖర్చులకు సంబంధించిన వివరాలను ఎన్నికల సంఘానికి అందించాలని కోరింది.  వివరాలు అందించని వ్యక్తులు భవిష్యత్తలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండదు. ఇక మేయర్ పీఠం ఎవర్ని వరిస్తుందో తెలియాలంటే ఫిబ్రవరి 11 వరకు ఆగాల్సిందే.