అజంఖాన్ పై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర

అజంఖాన్ పై కేంద్ర ఎన్నికల సంఘం కన్నెర్ర

ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి జయప్రద పై సమాజవాద్ పార్టీ నేత అజంఖాన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా పరిగణించింది. రేపు ఉదయం ఆరు గంటల నుంచి 72 గంటల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అజమ్ ఖాన్ పై ఆంక్షలు విధించింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అజంఖాన్ కోడ్ ఉల్లంఘించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ధారించింది. దీంతో ఆయనపై చర్యలకు ఉపక్రమించింది.

మరోవైపు బీజేపీ అభ్యర్ధి జయప్రదపై అమర్యాదకరంగా వ్యాఖ్యానించిన కేసులో సమాజ్ వాదీ పార్టీ నేత ఆజం ఖాన్ కు జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యు) నోటీసులు పంపింది. అంతకు ముందు ఆజం ఖాన్ పై కేసు నమోదైంది. బీజేపీ ఆయనపై ఐపీసీ 509 (మహిళలపై అవమానకర వ్యాఖ్యలు), సెక్షన్ 125 కింద పోలీస్ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.