24 గంటల ఈవీఎం కంట్రోల్ రూమ్..

24 గంటల ఈవీఎం కంట్రోల్ రూమ్..

ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో 24 గంటల అందుబాటులో ఉండే విధంగా ఈవీఎం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈవీఎంల స్టోరేజీ, భద్రత, ఏజెంట్ల నియామకం, సీసీటీవీ మానీటరింగ్, తదితర అంశాలపై నేరుగా ఎన్నికల ఎకమిషన్‌కు ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఫోన్ నంబర్ 011 -23052123తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కాగా, ఎన్నికల సమయంలో ఎలాంటి సెక్యూరిటీ లేకుండా ఈవీఎంలను తరలించడం.. అర్ధరాత్రి సమయంలో ఆటోలో ఈవీఎంలను తీసుకెళ్లడం వంటి ఘటనలో చోటు చేసుకున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది.