చంద్రగిరి నియోజకవర్గ పోలింగ్ అధికారులపై వేటు..

చంద్రగిరి నియోజకవర్గ పోలింగ్ అధికారులపై వేటు..

సార్వత్రి ఎన్నికల్లో భాగంగా ఏపీలో తొలి దశ పోలింగ్ నిర్వహించారు. అయితే, ఈదే సమయంలో ఎన్నికలు జరిగిన చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని అవకతవకలు చోటు చేసుకున్నాయి. దీంతో ఆ నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీ-పోలింగ్ నిర్వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఆదివారం రోజు రీపోలింగ్ కూడా నిర్వహించారు. అయితే, గతంలో జరిగిన అక్రమాలకు బాధ్యులైన అధికారులపై వేటు వేసింది ఎన్నికల కమిషన్... పీవో, ఏపీవోలను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. చంద్రగిరి నియోజకవర్గంలోని ఎన్ ఆర్ కమ్మపల్లి, పులవర్తిపల్లి,  కొత్త కండ్రిగ, కమ్మపల్లి,  వెంకట్రామపురంలలోని 321, 104, 316, 318, 313 పోలింగ్ కేంద్రాల్లో పీవో, ఏపీవోలు వ్యవహరించినవారిపై సస్పెన్షన్ వేటు వేసింది. వీరిపై శాఖాపరమైన చర్యలూ తీసుకోవాలని ఈసీ ఆదేశించింది. ఐదు పోలింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడిన అనధికార వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ఎన్నికల కమిషన్.