సంచులకొద్ది డబ్బు.. వెల్లోర్‌లో ఎన్నికలు రద్దు!?

సంచులకొద్ది డబ్బు.. వెల్లోర్‌లో ఎన్నికలు రద్దు!?

ఇవాళ్టితో ప్రచారానికి తెరపడనుంది... మరో రెండు రోజుల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. అయితే, ఆ నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. అదే త‌మిళ‌నాడులోని వెల్లోర్ లోక్‌స‌భ స్థానం. సంచులకొద్ది డబ్బులు  పట్టుబడడమే ఇందుకు కారణం కానుంది. ఈ  నియోజకవర్గంలో డబ్బుల ప్రవాహం ఎక్కువగా ఉండడంతో లోక్‌సభ ఎన్నికలను రద్దుచేసే యోచనలో ఉంది ఎన్నికల సంఘం. ఈ నియోజకవర్గంలో డీఎంకే నుంచి బరిలోకి అభ్యర్థి ఇంట్లో సంచుల నిండా డ‌బ్బును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నిక ర‌ద్దు చేయాల‌నే ప్రతిపాద‌న‌ను ఎన్నికల సంఘం.. భారత రాష్ట్ర‌ప‌తికి చేర‌వేసింది. ఇక రాష్ట్ర‌ప‌తి నిర్ణ‌యం మీదే వెల్లోర్ ఎన్నికల ఆధారపడి ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో రెండో విడతలో భాగంగా ఈ నెల 18వ తేదీన వెల్లోర్ లో పోలింగ్ జరగాల్సి ఉంది. డీఎంకే నేత‌కు చెందిన సిమెంట్ గోడౌన్ నుంచి ఐటీ అధికారులు దాదాపు రూ. 12 కోట్లు సీజ్ చేశారు. దీంతో ఇప్పుడు ఎన్నికలు జరుగుతాయా? లేదా? అనే ఉత్కంఠ నెలకొంది.