ఇంగ్లాండ్-వెస్టిండీస్ : టెస్ట్ జట్టును ప్రకటించిన ఇసిబి 

ఇంగ్లాండ్-వెస్టిండీస్ : టెస్ట్ జట్టును ప్రకటించిన ఇసిబి 

వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టుకు 13 మంది సభ్యుల జట్టును ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) ప్రకటించింది. జట్టులో ఇంగ్లాండ్ ఏకైక స్పిన్నర్‌గా డోమ్ బెస్ ఎంపికయ్యాడు, అయితే వికెట్ కీపర్ బ్యాట్స్మాన్ జానీ బెయిర్‌స్టో మరియు ఆల్ రౌండర్ మొయిన్ అలీ తుది జట్టుకు దూరమయ్యారు.  ఇసిబి సెంట్రల్ కాంట్రాక్టును కోల్పోయిన తరువాత టెస్ట్ క్రికెట్ నుండి విరామం తీసుకుంటున్నట్లు మొయిన్ సెప్టెంబర్ లో ప్రకటించాడు, కాని అతన్ని కూడా ఇంగ్లాండ్  శిక్షణా బృందంలో చేర్చారు కానీ జట్టులో చోటు కల్పించలేదు. ఇక మొయిన్ కు బదులుగా  జనవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఐదు వికెట్ల తీసుకున్న ఆఫ్ స్పిన్నర్ బెస్‌తో కలిసి వెళ్లాలని ఇసిబి అతడిని ఎంచుకుంది. కరోనావైరస్ మహమ్మారి కారణంగా మూడు నెలల విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ పునః  ప్రారంభం అయ్యే టెస్ట్ మ్యాచ్ కోసం ఇసిబి తొమ్మిది మంది రిజర్వ్ ఆటగాళ్లను తీసుకుంది. ఇక ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ తనకు బిడ్డ పుట్టబోతున్న కారణంగా ఈ మ్యాచ్ కు దూరమయ్యాడు. దాంతో ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టుకు న్యాయకత్వం వహించేది తమ అత్యుతమ ఆల్ రౌండర్  బెన్ స్టోక్స్.

ఇంగ్లాండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమ్స్ ఆండర్సన్, జోఫ్రా ఆర్చర్, డొమినిక్ బెస్, స్టువర్ట్ బ్రాడ్, రోరే బర్న్స్, జోస్ బట్లర్ (wk), జాక్ క్రాలే, జో డెన్లీ, ఆలీ పోప్, డోమ్ సిబ్లీ, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్. 

రిజర్వ్స్: జేమ్స్ బ్రేసీ, సామ్ కుర్రాన్, బెన్ ఫోక్స్ (wk), డాన్ లారెన్స్, జాక్ లీచ్, సాకిబ్ మహమూద్, క్రెయిగ్ ఓవర్టన్, ఆలీ రాబిన్సన్, ఆలీ స్టోన్.