దూసుకుకపోతున్న ఇసిబి... కానీ బీసీసీఐ.. 

దూసుకుకపోతున్న ఇసిబి... కానీ బీసీసీఐ.. 

కరోనా కారణంగా వచ్చిన విరామం తర్వాత ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) దూసుకపోతుంది. మొదట వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూలై 8 న అభిమానుల లేకుండా ప్రభుత్వ ఆమోదానికి లోబడి ప్రారంభమవుతుందని ఇసిబి తెలిపింది. ఈ నిర్వాహణలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటూనే బుధవారం మ్యాచ్ నిర్వహించడానికి సిద్దమైనది. ఇక ఆ తర్వాత ఆగస్టు లో పాకిస్థాన్ కు కూడా ఆతిధ్యమిస్తు ఇప్పటికే ఆ జట్టును కూడా తమ దేశానికి పిలిపించింది. ఇక ఇప్పుడు తాగాజా పాక్ తో జరిగే టెస్ట్ మరియు టీ 20 సిరీస్ల యొక్క షెడ్యూల్ ను కూడా ప్రకటించేసింది. పాక్ తో ఆగస్టు 5 న ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో సిరీస్‌లోని మొదటి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇక రెండవ టెస్ట్ ఆగస్టు 13, ఆగస్టు 21 న జరిగే మూడవ మ్యాచ్ తో టెస్ట్ సిరీస్ ముగుస్తుంది. ఆ తర్వాత వరుసగా  ఆగస్టు 28, 30 మరియు సెప్టెంబర్ 1 న మూడు టీ 20 మ్యాచ్లను నిర్వహించనుంది. అయితే  ఇసిబి కరోనా తర్వాత ఇలా దూసుకపోతుంటే బీసీసీఐ మాత్రం ఇంకా ఆటగాళ్లకు శిక్షణ శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయలేదు. చూడాలి మరి ఈ కరోనా విరామం మన భారత ఆటగాళ్లకు ఇంకా ఎన్ని రోజులు అనేది.