పాకిస్థాన్ ఇంగ్లాడ్ పర్యటన ఫిక్స్...

పాకిస్థాన్ ఇంగ్లాడ్ పర్యటన ఫిక్స్...

కరోనా కారణంగా వాయిదా పడిన తమ ఇంగ్లాండ్ పర్యటనను మళ్ళీ ఇప్పుడు షెడ్యూల్ చేసింది పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ). అయితే ఈ 3 మ్యాచ్‌ల టెస్ట్, టీ 20 సిరీస్‌కు సన్నాహాలు ప్రారంభించినప్పటి నుండి పాకిస్తాన్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం మొదలయ్యింది. జూన్ 28 న ఇంగ్లాడ్ ప్రయాణానికి ముందు ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి  పీసీబీ కరోనా పరీక్షలు నిర్వహించగా మొదట ముగ్గురికి తర్వాత ఏడుగురికి మళ్ళీ ఇప్పుడు కొత్తగా 9 మందికి కరోనా  పాజిటివ్ వచ్చింది. అందువల్ల పాక్ పర్యటన ఆగిపోతుంది అని వార్తలు వస్తున్నాయి. ఈ విషయం పై ఇంగ్లాండ్ మరియు వేల్స్ క్రికెట్ బోర్డు (ఇసిబి) తన ప్రకటనతో ఓ క్లారిటీ ఇచ్చింది. పాక్ జట్టు మా దేశానికి వస్తుంది. వచ్చిన తర్వాత ఆటగాళ్లు అందరూ 14 రోజుల దిగ్బంధానికి లోనవుతారని ఇసిబి తన ప్రకటనలో తెలిపింది. అయితే ఈ సిరీస్ నియమాల ప్రకారం పాకిస్తాన్ జట్టు మొదటి టెస్ట్ వరకు కనీసం ఐదుసార్లు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. చూడాలి మరి ఆ పరీక్షలో ఏం వస్తుంది అనేది. ఎవరికైనా పాజిటివ్ వస్తే మొత్తం సిరీస్ నిలిపివేయాల్సి ఉంటుంది.