కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. వెలుగులోకి ఆసక్తికర విషయాలు..
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో... ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితురాలు స్వప్నా సురేష్... ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒత్తిడితోనే సీఎం విజయన్ పేరు చెప్పిందంటూ ఓ పోలీస్ అధికారి వెల్లడించారు. విచారణ సమయంలో... స్వప్నా సురేష్‌ను బెదిరించడంతోనే విజయన్ పేరు చెప్పిందన్నారు. అంతేకాకుండా సదరు వ్యక్తి లిఖితపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల వేళ... అమిత్ షా ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఎక్కడికెళ్లినా... ప్రచారంలో సీఎం విజయన్ను టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నారు. తిరువనంతపురం ఎయిర్పోర్ట్... గోల్డ్ స్మగ్లింగ్‌కు అడ్డాగా మారిపోయిందంటూ షా కామెంట్ చేశారు.
అమిత్ షా వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి విజయన్ కౌంటర్ ఇచ్చారు. త్రివేండ్రం ఎయిర్పోర్ట్ పూర్తిగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుందన్న విషయం... తెలియదా అని ప్రశ్నించారు. గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతుంటే... ఏం చేస్తున్నారని నిలదీశారు. అరికట్టాల్సిన బాధ్యత లేదా అన్న ఆయన... అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు... ఇలా అసెంబ్లీ ఎన్నికల సమయంలో గోల్డ్ స్కామ్ కేసును ఉపయోగించుకోవాలని చూస్తోన్న బీజేపీకి గట్టి కౌంటర్ ఇస్తున్నారు సీఎం విజయన్.. అయితే, సీఎంకు లింకులే ఉంటే.. ఆదిలోనే ఈ స్కామ్‌లో ఎన్ఐఏతో విచారణ జరిపించాలని కేంద్రం దృష్టికి ఎందుకు తీసుకెళ్తారని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)