నాయిని అల్లుడి ఇంట్లో ముగిసిన సోదాలు... విలువైన పత్రాలు స్వాధీనం... 

నాయిని అల్లుడి ఇంట్లో ముగిసిన సోదాలు... విలువైన పత్రాలు స్వాధీనం... 

ఈఎస్ఐ స్కామ్ లో ఈడీ గత కొన్ని రోజులుగా సోదాలు నిర్వహిస్తోంది.  గత 24 గంటలుగా దివంగత నేత నాయిని నర్సింహారెడ్డి అల్లుడు శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించింది.  24 గంటల పాటు ఈ సోదాలు చేసిన ఈడీ విలువైన వస్తువులు,డాకుమెంట్స్, నగదును స్వాధీనం చేసుకుంది.  నగదుతో పాటుగా పెద్ద ఎత్తున బ్లాంక్ చెక్ లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది.  ఈఎస్ఐ స్కామ్ లో శ్రీనివాస్ రెడ్డి, ముకుంద్ రెడ్డిలది కీలక పాత్ర అని ఈడీ గుర్తించింది.  ముకుంద్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డిలు కలిసి మెడికల్ వైద్య పరికరాలను కొనుగోళ్లు చేయడంలో కీలక పాత్ర పోషించారని ఈడీ గుర్తించింది.  నిన్నటి నుంచి ఏడుగురి ఇళ్లల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఇప్పటి వరకు మూడు కోట్ల పై చిలుకు నగదుతో పాటుగా కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు, ఆభరణాలు, ఆస్తుల పాత్రలను ఈడీ స్వాధీనం చేసుకుంది.  రూ.200 కోట్ల రూపాయల ఈఎస్ఐ స్కామ్ లో మనీలాండరింగ్ హవాలా జరిగినట్టు అధికారులు గుర్తించారు.   ఈ కేసులో ప్రధాన సూత్రధారి ఈఎస్ఐ మాజీ డైరెక్టర్ దేవికారాణి కీలక పాత్ర ఉన్నట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు.