బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

బీజేపీలో చేరిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే

టీడీపీ రాజ్యసభ ఎంపీల చేరికతో బీజేపీలోకి మొదలైన వలసలు జోరుగా కొనసాగుతున్నాయి. టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లా మాజీ జెడ్పీ ఛైర్మన్ ఈదర హరిబాబు ఇవాళ కమలం గూటికి చేరారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా సమక్షంలో ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తనవంతు కృషి చేస్తానన్నారు హరిబాబు. 1994లో ఒంగోలు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున హరిబాబు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014 ఎన్నికల తర్వాత జడ్పీ ఛైర్మన్ పదవి విషయంలో టీడీపీతో విభేదాలు రాగా.. వైసీపీతో కలిసి పదవిని దక్కించుకున్నారు హరిబాబు. ఐతే.. ఇటీవల ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థుల తరఫున ఆయన ప్రచారం చేశారు.