రేపు యడ్యూరప్ప ప్రమాణం

రేపు యడ్యూరప్ప ప్రమాణం

రేపు ఉదయం బీజేపీ నేత యడ్యూరప్ప కర్ణాటక 24వ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా బీజేపీ నేత యడ్యూరప్పకు రాజ్‌భవన్‌ నుంచి ఆహ్వానం అందింది. ఈ విషయాన్ని తొలుత ఓబీజేపీ ఎమ్మెల్యే ట్వీట్‌ ద్వారా బయటపెట్టారు. రేపు ఉదయం 9 గంటల నుంచి 9.30 గంటల మధ్య ప్రమాణ స్వీకారం జరుగుతుందని రాజ్‌భవన్‌ వర్గాలు ధృవీకరించాయి.  రేపు మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రమాణం చేయాలని యడ్యూరప్ప భావించినా.. ముహూర్తబలం దృష్ట్యా ఉదయం 9 నుంచి 9.30 గంటల లోపల ప్రమాణం చేయాలని నిర్ణయించారు. రాజ్‌భవన్‌లోనే ఈ ప్రమాణ స్వీకారం ఉంటుంది. అలాగే యడ్యూరప్ప ఒక్కరే రేపు సీఎంగా ప్రమాణం చేస్తారు. అసెంబ్లీలో బలనిరూపణ తరవాత  మంత్రి వర్గ విస్తరణ చేపడతారని తెలుస్తోంది.