ఈడెన్ గార్డెన్స్ లో కరోనా కలకలం

ఈడెన్ గార్డెన్స్ లో కరోనా కలకలం

ప్రస్తుతం భారత్ లో కరోనా వేగంగా వ్యాపిస్తుంది. రోజుకు దాదాపు 20000 కేసులు నమోదవుతున్నాయి. అయితే మొదట విధించిన లాక్ డౌన్ లో సడలింపులు ఇచ్చిన తర్వాతే కేసులు ఇంతలా పెరిగాయి. లాక్ డౌన్ నుండి కొంత ఊరట లభించగానే చాల కార్యక్రమాలు, ఆఫీసులు ప్రారంభమయ్యాయి. అదే తరహాలో  క్రికెట్ స్టేడియాలు కూడా తెరిచారు. అయితే అందులో భాగంగా తెరిచిన కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ స్టేడియం సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్‌గా వచ్చింది. దాంతో వెంటనే స్పందించిన బెంగాల్ క్రికెట్ అసోషియేషన్ (క్యాబ్) తమ హెడ్‌క్వార్టర్స్‌ని వారం రోజుల పాటు మూసివేస్తున్నట్లు దాని అధ్యక్షుడు అవిషేక్ దాల్మియా తెలిపారు. అయితే ఈ కరోనా సోకినా వ్యక్తి ఓ సివిల్ ఇంజినీర్‌. ఇక గత వారం నుండి అనారోగ్యంతో బాధపడుతున్న అతను విధులకి కూడా రాలేదు. అనుమానంతో అతను కరోనా వైరస్ పరీక్షలు చేయించుకోగా.. ఫలితాల్లో  పాజిటివ్‌ వచ్చింది. కరోనా బాధితుడు వారం నుండిఅతను ఆఫీస్‌కి రాకపోయినా.. ముందు జాగ్రత్తగా హెడ్‌క్వార్టర్స్‌ని 7 రోజులపాటు మూసి శానిటైజ్ చేయాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు  దాల్మియా తెలిపారు.