ఈ నగరానికి ఏమైంది? ప్రీరిలీజ్ వేడుక లైవ్

ఈ నగరానికి ఏమైంది? ప్రీరిలీజ్ వేడుక లైవ్

'పెళ్లి చూపులు' మొదటి సినిమాతోనే అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు తరుణ్‌ భాస్కర్‌. చాలా గ్యాప్‌ తీసుకుని తన రెండో సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ముందుకు రాబోతున్నారు. నలుగురు స్నేహితుల పాత్రల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా యూత్‌ను ఆకర్షించేలా ఉంది. విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గౌతం, వెంకటేష్ కాకుమాను, అనీషా ఆంబ్రోస్ సిమ్రాన్ చౌదరి నటీనటులుగా తెరకెక్కిన ఈ సినిమా ఈరోజు ప్రీరిలీజ్ వేడుక ఘనంగా జరుపుకుంటుంది. 

ఈ నగరానికి ఏమైంది? అంటూ అందరికీ పరిచయమైన యాడ్‌లోని లైన్‌ను టైటిల్‌గా పెట్టారు చిత్ర దర్శక నిర్మాతలు. ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఈ సినిమాపై పాజిటివ్‌ టాక్‌ వినిపిస్తోంది. జూన్‌ 29న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ నిర్మిస్తోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్‌  వేడుకను లైవ్ లో చూడాలంటే క్రింది వీడియోను క్లిక్ చేయండి.